గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 15:50:02

తెలుగు రాష్ర్టాల ఆర్టీసీ మ‌ధ్య కీల‌క ఒప్పందం

తెలుగు రాష్ర్టాల ఆర్టీసీ మ‌ధ్య కీల‌క ఒప్పందం

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బ‌స్ భ‌వ‌న్‌లో తెలంగాణ‌, ఏపీ ఆర్టీసీ ఎండీల కీల‌క భేటీ జ‌రిగింది. ఇరు రాష్ర్టాల మ‌ధ్య అంత‌ర్ రాష్ర్ట బ‌స్సు స‌ర్వీసుల‌పై కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇప్ప‌టికే ఇరు రాష్ర్టాల ఆర్టీసీ బ‌స్సులు తిప్పే కిలోమీట‌ర్ల‌పై ఏకాభిప్రాయం కుదిరిన విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ్టి స‌మావేశంలో ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసుల‌పై తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాల మ‌ధ్య ఎన్ని కిలోమీట‌ర్లు తిప్పాల‌న్న ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీఎస్ ఆర్టీసీ 1,61,258 కిలోమీట‌ర్లు, తెలంగాణ‌లో ఏపీఎస్ ఆర్టీసీ 1,60,999 కిలోమీట‌ర్ల మేర బ‌స్సుల‌ను తిప్ప‌నున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ ఆర్టీసీ 826 బ‌స్సుల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించ‌గా, తెలంగాణ‌లో ఏపీ 638 బ‌స్సుల‌ను న‌డ‌ప‌నుంది. ఇక తెలంగాణ ఆర్టీసీ విజ‌య‌వాడ రూట్‌లో 273 బ‌స్సుల‌ను న‌డ‌ప‌నుంది. అదే రూట్‌లో ఏపీ 192 బ‌స్సు స‌ర్వీసుల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది.