Chhattisgarh | అబ్బాయిలతో ఫోన్ మాట్లాడొద్దని చెప్పినందుకు.. అన్నను గొడ్డలితో నరికి చంపిన 14 ఏండ్ల బాలిక
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) ఖైరాగఢ్ చుయిఖదాన్ గండై జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. అబ్బాయిలతో ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావని మందలించినందుకు ఓ 14 ఏండ్ల బాలిక తన అన్నని నరికి చంపింది.
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) ఖైరాగఢ్ చుయిఖదాన్ గండై జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. అబ్బాయిలతో ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావని మందలించినందుకు ఓ 14 ఏండ్ల బాలిక తన అన్నని నరికి చంపింది. అమ్లిదిహ్కల గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గ్రామానికి చెందిన 14 ఏండ్ల బాలిక తరచూ ఫోన్లో అబ్బాయిలతో మాట్లాడుతున్నది. గమనించిన ఆమె అన్న (18).. ఇకపై ఫోన్లో అబ్బాయిలతో మాట్లాడొద్దని ఈ నెల 3న హెచ్చరించాడు. మొబైల్ వాడటానికి వీళ్లేదని చెప్పాడు. దీంతో అన్నపై కోపంతో రగిలిపోయిన ఆమె.. అతడు నిద్రపోతున్న సమయంలో గొడ్డలి తీసుకుని మెడపై నరికింది. తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
రక్తపు మరకలు కావడంతో స్నానం చేసిన ఆమె.. ఆ దుస్తులను దాచిపెట్టింది. అనంతరం తన అన్నని ఎవరో హత్యచేశారని ఇరుగుపొరుగువారికి చెప్పింది. దీంతో స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. బాలికను తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరాన్ని ఒప్పుకున్నది. అన్నని తానే చంపానని, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని వెల్లడించింది. ఫోన్లో మాట్లాడినందకు తనను దూషించడాని.. అందుకే చంపేశానని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

