జోగులాంబ గద్వాల : సీడ్ ఆర్గనైజర్ బండ్ల రాజశేఖర్ రెడ్డిని( Bandla Rajasekhar Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన వడ్డే రాజేశ్వరి(16) అనే బాలిక గత నెల 24వ తేదీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మైనర్ ఆత్మహత్యకు కారణమైన ప్రధాన నిందితుడు బండ్ల రాజశేఖర్ రెడ్డిని సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. కర్ణాటకలోని రాయచూరులో అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డిని కోర్టులో హాజరుపరుస్తు న్నట్లు సీఐ తెలిపారు.