అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభా బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 2026-27 సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్ (AP budget ) కాపీలను ముందుగా విజయవాడలోని కనకదుర్గమ్మ ( Kanaka Durgamma ) పాదల చెంత ఉంచారు. ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్, ఆర్తిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు.
అనంతరం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. రూ.3.32,205 కోట్లతో బడ్జెట్ను ప్రవేవ పెట్టారు. రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ. 53,915 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు, ద్రవ్య లోటు రూ. .75,868 కోట్లు ఉంటుందని మంత్రి వెల్లడించారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 6 వేల కోట్లు, రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్టులకు రూ. 13,546 కోట్లు, విద్యుత్ రంగానికి రూ 13,934 కోట్లు , గృహ నిర్మాణ రంగానికి రూ. 5,451 కోట్లు , ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4 వేలు కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హచ్కు రూ. 30 వేల కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 13,598 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 6,105 కోట్లు కేటాయించన్నుట్లు వివరించారు .