Shivaratri | శివరాత్రి వేడుకలకు మద్దిమాడ స్వయంభు ఆలయం ముస్తాబు
Shivaratri | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్( మద్దిమాడ స్వయంభు రాజరాజేశ్వర దేవాలయం శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది.
కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్( Devapur ) మద్దిమాడ స్వయంభు రాజరాజేశ్వర దేవాలయం శివరాత్రి ( Shivaratri ) వేడుకలకు ముస్తాబైంది. ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా శనివారం నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఆలయాన్ని పూలు, దీపాలతో ముస్తాబు చేశారు. నలువైపులా స్వాగత తోరణాలు, భక్తులు స్వయంభు శివాలయం సన్నిధికి చేరుకునేందుకు వీలుగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
15న శివరాత్రి సందర్బంగా పార్వతి పరమేశ్వర కల్యాణం , సోమవారం 16న రథయాత్ర, శోభ యాత్ర ఉంటుందని అర్చకులు అర్చకులు గొల్లపల్లి మారుతీశ్వర ఆచార్యులు, బ్రహ్మ శ్రీ బెజ్జంకి సాయి నాథ ఆచార్య తెలిపారు. ప్రత్యేక లడ్డూ ప్రసాద వితరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దేవాలయ కమిటీ చైర్మన్ యనగందుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తట్ర భీం రావు తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

