Harish Rao | పచ్చని పంట పొలాల్లో ఫార్మా చిచ్చు పెడుతున్న రేవంత్ రెడ్డి : హరీశ్ రావు ఫైర్
Harish Rao | గరీబీ హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే..ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఫైర్ అయ్యారు.
హైదరాబాద్ : గరీబీ హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే..ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఫైర్ అయ్యారు. వికారాబాద్ జిల్లా ఫార్మా సిటీ (Pharma city) ఘటన పట్ల ఆయన ఘాటుగా స్పందించారు.
రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని మండిపడ్డారు. ఈరోజు ఆ రాయి ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వికారాబాద్ రైతన్నల నెత్తిన పడింది. అందుకే రైతులు రేవంత్ మీద ఉన్న కోపాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారుల మీద చూపుతున్నారని తెలిపారు.
రేవంత్ చేస్తున్న అసమర్థ పాలనకు ఐఏఎస్‌లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారు. ఫార్మా సిటీ కోసం నాడు కేసీఆర్ హైదరాబాద్ దగ్గరగా, కాలుష్యం లేకుండా, జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాలు సేకరించి సిద్ధం చేసిండు. పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వచ్చినా దాన్ని పక్కన బెట్టి పచ్చటి పొలాల్లో రేవంత్ ఫార్మా చిచ్చు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జహీరాబాద్ న్యాల్కల్ మండలంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు.
రియల్ ఎస్టేట్ దందా కోమే..
ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని తన రియల్ ఎస్టేట్ దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్య మొదలైందని ఆరోపించారు. నీ మీద, నీ పాలన మీద తిరగబడని వర్గం ఏదైనా ఉందా రేవంత్ రెడ్డి?ఇప్పటికైనా పిచ్చి పనులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు. పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.
కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో ఫార్మా సిటీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కారుపై గ్రామస్తులు రాళ్లతో దాడి చేశారు. ఫార్మా విలేజ్ భూసేకరణపై చర్చించేందుకు కలెక్టర్, తహశీల్దార్ లగచర్ల గ్రామానికి వెళ్లారు. అయితే ఊరికి 2 కి.మీ. దూరంలో గ్రామసభ ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు నిరసన తెలిపారు. కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్, తహసీల్దార్ వాహనాలపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. కలెక్టర్‌పై ఓ మహిళ చేయి చేసుకున్నట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

