Seed Ganesha | హైదరాబాద్ : మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గురువారం హైదారాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి, రాఘవ, మాజీ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డిలతో కలసి సీడ్ గణేశా(విత్తన గణపతి) కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విత్తన గణపతి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంతోష్ కుమార్ వెల్లడించారు.
ఈ విగ్రహాలు స్వచ్ఛమైన మట్టి, కోకోపీట్ లేదా కోకో పౌడర్‌తో వివిధ రకాల విత్తనాలతో తయారు చేయబడ్డాయని తెలిపారు. పూజ చేసిన తరువాత, ఈ విగ్రహాలను మట్టిలో లేదా పెద్ద కుండలో ఉంచవచ్చు. అక్కడ కొన్ని రోజుల తర్వాత విత్తనాలు మొలకెత్తడం ప్రారంభిస్తాయన్నారు. నిర్దిష్ట పరిమాణంలోకి వచ్చిన తర్వాత వాటిని తిరిగి అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు లేదా పార్కుల్లో మట్టిలో నాటవచ్చని తెలిపారు.
పర్యావరణ, ఆరోగ్య ప్రయోజనాల కోసం చింతపండు, వేప వంటి చెట్లను ఎక్కువగా పెంచాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన సలహా మేరకు విత్తన గణపతి విగ్రహాలను ప్రారంభించారు. పెరుగుతున్న పర్యావరణ కాలుష్యంతో, ప్రతి నిమిషం అనేక చెట్లను పెంచడం, మొక్కలు నాటడం, వాటిని పెంపొందించడం చాలా అవసరమన్నారు సంతోష్. విత్తన గణపతి కార్యక్రమంలో భాగంగా ఔషధ విలువలు కలిగిన మొక్కలను నాటేలా ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా విత్తన గణపతి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు సంతోష్. తెలంగాణలో గ్రీన్ కవర్‌ను మెరుగుపరచడానికి హరితహారం కార్యక్రమం స్ఫూర్తితో 2018లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని ప్రారంభించారు సంతోష్ కుమార్.
ఈ కార్యక్రమంలో సద్గురు, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, సంజయ్ దత్, అజయ్ దేవగన్, శృతి హాసన్, శ్రద్ధా కపూర్, చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, కృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రాజమౌళి, సమంతా, పుల్లెల గోపీచంద్, సానియా గోపీచంద్, సానియా గోపీచంద్, పీవీ సింధు, పీవీ సింధు వంటి ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటారు. కొంతమంది ప్రముఖులు అడవులను దత్తత సైతం తీసుకున్నారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం మరింతగా విస్తరించి ప్రముఖుల పుట్టినరోజులు, బీఆర్ఎస్ నేతల బర్త్ డే, వివాహ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
Celebrating 5 amazing years of promoting sustainability with #SeedGanesha idols through the #GreenIndiaChallenge! These eco-friendly idols are a great alternative to harmful PoP idols. Let’s blend tradition with innovation and nurture nature this #GaneshChaturthi. pic.twitter.com/fm3ghXAIwm
— Santosh Kumar J (@SantoshKumarBRS) September 5, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | గురువులకు మద్దతుగా పిడికిలెత్తిన గురుకుల విద్యార్థులు.. హరీశ్‌రావు ట్వీట్
KTR | రాష్ట్రానికి హోం మంత్రి లేకపోవడం వల్లే జైనూర్ లాంటి ఘటనలు : కేటీఆర్
Harish Rao | కళ్యాణలక్ష్మి చెక్కుల కోసం హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది : హరీశ్‌రావు