KTR | రెండేళ్లుగా రాష్ట్రంలో కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైడ్రా పేరుతో కూల్చివేతలు చేస్తున్నారని.. కాళేశ్వరం బ్యారేజ్‌ను చెక్‌డ్యామ్‌లను పేల్చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఇసుక అమ్మేందుకు ఉన్న చెక్‌డ్యామ్‌లను బాంబులు పెట్టి పేల్చేస్తున్నారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు దోసల అనిల్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఎన్నికలకు ముందు కల్యాణలక్ష్మీ కింద ఆడబిడ్డల పెళ్లికి రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని సోనియాగాంధీ మీద రేవంత్ రెడ్డి ఒట్టువేశాడని తెలిపారు. మహిళలకు రూ.2500 ఇస్తానని ప్రియాంక గాంధీ మీద ఒట్టు వేశాడని గుర్తుచేశారు. ఇవన్నీ ఎగవేసి.. ఇప్పుడు కోటి మంది మహిళలకు కోటీశ్వర్లను చేస్తానంటున్నాడని మండిపడ్డారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలంటే బడ్జెట్ సరిపోతుందా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేతలు, పేల్చివెతలు, ఎగవేతలు మాత్రమే జరుగుతున్నాయి
కూల్చివేతలు అంటే హైడ్రా అని పేరు పెట్టి పేదల ఇళ్లు కూలుస్తున్నారు
రెండోది పేల్చివేతలు.. ఈ కాంగ్రెస్ లంగలే ఆ కాళేశ్వరంలో మేడిగడ్డను పేల్చారు, ఇప్పుడు రెండు మూడు చెక్ డ్యాములు… pic.twitter.com/72HwFdH7RD
— Telugu Scribe (@TeluguScribe) December 26, 2025
బ్యాగులు మోసి జైలుకెళ్లి.. పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యాడని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు వేశారు. ఢిల్లీకి సంచులు మోసి పదవులు కాపాడుకుంటున్నాడని ఆరోపించారు. మహిళలకు ఇస్తానన్న రూ.2500 ఎక్కడపోయాయని అడిగితే నీ గుడ్లు పీకి గోటీలు ఆడుకుంటా అంటున్నాడని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వమంటే నీ లాగుల తొండలు ఇడుస్తా అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను తిట్టాలనుకుంటే మూడు భాషల్లో పొల్లుపొల్లు తిడతానని స్పష్టం చేశారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఇష్టారీతిన మొరుగుతున్నాడని అన్నారు. అమ్మ గీతమ్మ రేవంత్ రెడ్డిని కట్టేయ్.. లేదంటే ఎవరినన్న కరిచేలా ఉన్నాడని విమర్శించారు. కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి రాకుండా చేస్తానని రేవంత్ రెడ్డి శపథం చేస్తున్నాడని తెలిపారు. జనవరి 1 నుంచి మహిళలకు రూ.2500 ఇస్తానని శపథం చేయాలని రేవంత్ రెడ్డికి సూచించారు.