Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో పని చేస్తున్న పార్ట్‌టైమ్ టీచర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సీరియస్‌గా స్పందించారు. ఇక గౌలిదౌడ్డి గురుకుల పాఠశాలలో తొలగించిన ఫ్యాకల్టీని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని విద్యార్థులు పిడికిలి బిగించడం అభినందనీయం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం రోజున తమ గురువులను సన్మానించుకునే సంబరాల్లో మునిగి తేలాల్సిన విద్యార్థులను రేవంత్ ప్రభుత్వం చదువులు మానేసి ధర్నాలకు దిగేలా చేయడం దురదృష్టకరం అని హరీశ్‌రావు అన్నారు. తమ గురువులకు మద్దతుగా గురుకుల విద్యార్థులు పిడికిలి బిగించడం అభినందనీయమన్నారు. ఐఐటి, ఎన్ఐటి, నీట్ వంటి జాతీయస్థాయి పరీక్షల్లో విద్యార్థులు ర్యాంకులు సాధించేలా వెన్నంటి నిలిచిన గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఉపాధ్యాయులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
విద్యా సంవత్సరం మధ్యలో 6200 మంది గురుకుల ఉపాధ్యాయులను తొలగించిన మీ నిర్ణయం వల్ల ఈరోజు వేలమంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉద్యోగాల నుంచి తీసేసిన గురుకుల టీచర్లను తక్షణమే విధుల్లోకి తీసుకుని విద్యార్థుల భవిష్యత్ కాపాడాలి. తమ పిల్లల భవిష్యత్తు గురించి కలలుగన్న తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెబుతారు రేవంత్ రెడ్డి? అని హరీశ్‌రావు నిలదీశారు.
ఉపాధ్యాయ దినోత్సవం రోజున తమ గురువులను సన్మానించుకునే సంబరాల్లో మునిగి తేలాల్సిన విద్యార్థులను రేవంత్ ప్రభుత్వం చదువులు మానేసి ధర్నాలకు దిగేలా చేయడం దురదృష్టకరం. తమ గురువులకు మద్దతుగా గురుకుల విద్యార్థులు పిడికిలి బిగించడం అభినందనీయం.
ఐఐటి, ఎన్ఐటి, నీట్ వంటి జాతీయస్థాయి… pic.twitter.com/tnjbFMvlfw
— Harish Rao Thanneeru (@BRSHarish) September 5, 2024
ఇవి కూడా చదవండి..
KTR | రాష్ట్రానికి హోం మంత్రి లేకపోవడం వల్లే జైనూర్ లాంటి ఘటనలు : కేటీఆర్
Harish Rao | కళ్యాణలక్ష్మి చెక్కుల కోసం హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది : హరీశ్‌రావు