KTR | హైదరాబాద్ : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి పూర్తిస్థాయి హోం మంత్రి లేకపోవడం వల్లే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, జైనూర్ లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు జైనూర్ ఘటనపై కేటీఆర్ ట్వీట్ చేశారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఒక ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ జరిగిన హింసాత్మక చర్యల్లో అనేక ఆస్తుల విధ్వంసం జరగడం దురదృష్టకరం. బాధిత మహిళకు కేవలం లక్ష రూపాయల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గం. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ముందస్తు సమాచారం ఉన్నా వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని కేటీఆర్ మండిపడ్డారు.
జైనూర్‌లో తక్షణమే శాంతి నెలకొనేలా రాష్త్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలి. అల్లర్లలో ఇళ్లు, షాపులు కోల్పోయినవారికి సాయంగా నిలవాలి. పూర్తి స్థాయి హోం మంత్రి లేకుండానే తొమ్మిది నెలలుగా రాష్ట్రాన్ని నడపడం వల్లనే తరచూ ఇటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఒక ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ జరిగిన హింసాత్మక చర్యల్లో అనేక ఆస్తుల విధ్వంసం జరగడం దురదృష్టకరం. బాధిత మహిళకు కేవలం లక్ష రూపాయల “పరిహారం” ఇచ్చి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం…
— KTR (@KTRBRS) September 5, 2024
ఇవి కూడా చదవండి..
Crimes In Telangana | తెలంగాణలో ఏం జరుగుతోంది..! పోలీసులు ఏం చేస్తున్నారు..?
Harish Rao | రాష్టంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన: హరీశ్‌రావు
Encounter | భద్రాద్రి జిల్లాలో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి