Harish Rao | రాష్టంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన: హరీశ్‌రావు
Harish Rao | రాష్ట్రంలో నడుస్తున్నదని ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లెవరూ లేదరని చెప్పారు. వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు.
సిద్దిపేట: రాష్ట్రంలో నడుస్తున్నదని ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లెవరూ లేదరని చెప్పారు. వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. ప్రభుత్వం ముందుగా మేల్కొంటే మరింత ప్రాణనష్టం తగ్గే అవకాశం ఉండేదన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఖమ్మం, మహబూబాబాద్‌లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. సిద్దిపేట నుంచి ఉడుతా భక్తిగా సహాయం చేస్తున్నామన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నెల వేతనం వరద బాధితులకు అందిస్తున్నామని చెప్పారు. తమలాగే బీజేపీ, మిగిలిన పార్టీల నాయకులు సహాయం చేయడానికి మందుకు రావాలన్నారు. తాము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే తమపై దాడి చేసి కేసులు నమోదుచేస్తున్నారని వెల్లడించారు. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారని వెల్లడించారు. తమకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే దాడులు చేస్తున్నారని విమర్శించారు. బాధితులకు అన్నం, నీళ్లు ఇవ్వలేకపోయారని చెప్పారు. నీళ్లలో ఇండ్లు మునిగిపోయినవారికి రూ.2 లక్షలు ఇచ్చి ఆదుకోవాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

