RS Praveen Kumar | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి గారు.. మీకు నిజంగానే ఉపాధ్యాయుల మీద అపారమైన గౌరవం ఉంటే.. రాత్రికి రాత్రే 2000కు పైగా గురుకుల టీచర్ల కుటుంబాలను అకారణంగా రోడ్డున పడేయరని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
గురుకుల రిక్రూట్మెంట్లో మూడువేల బ్యాక్ లాగ్ పోస్టులు అకారణంగా ఉత్పన్నం అయ్యేవి కావు.. నాలుగున్నర లక్షల మంది ప్రైవేటు టీచర్లను మీరు ఎల్బీ స్టేడియంలో పబ్లిక్‌గా అవమానించే వారు కాదన్నారు. మెగా డీఎస్సీ పేరుతో ఇంత దగా జరిగేది కాదు. ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం జరిగేదని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
టీచర్లు లేక వందల స్కూళ్లు మూతపడేవి కాదు. అందరు ఎంఈవోల నియామకం జరిగేది. విద్యాశాఖ మంత్రి నియామకం ఆగేది కాదు. విద్యార్థులు న్యాయం కోసం రోడ్ల మీదికి రావడం, విషాహారం బారిన పడడం లాంటివి జరిగేవి కావు. తమరు కేవలం నటిస్తున్నారు..! ప్రియమైన ప్రజలారా.. ఇంత ఆవేదనాభరిత సమయంలో శోక సముద్రంలో మునిగిన టీచర్ల వైపు నిలబడాల్సిన సమయమిది.. పండుగ చేసుకునే సమయం అసలే కాదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
CM Revanth | సినిమా ఫంక్షన్ మూడ్‌లో ముఖ్యమంత్రి..! నిండా మునిగిన ఖమ్మం
Hydraa | హస్తం పార్టీలో చిచ్చురేపిన ‘హైడ్రా’..! కీలక నేతలే టార్గెట్‌గా రేవంత్ పావులు..?