Weather Update | ఈ నెల 8 వరకు ఎనిమిది 18 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, సిక్కిం, బీహార్, మధ్యప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి.
ఏపీలో వర్సాలకు ఆంధ్రప్రదేశ్‌లో 20 మంది మరణించగా.. 65వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారంతో పాటు సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. అలాగే, డ్రోన్లను సైతం వినియోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులతో భారీగా విరాళాలు ప్రకటించారు. మరో వైపు నాగాలాండ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. 29వ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడడంతో నాలాగాలండ్ రాజధాని కొహిమా, దిమాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో ఓ మహిళ సహా ఆరుగురు చనిపోయారు. మరో నలుగురు గల్లంతయ్యారు. మరోవైపు బద్రీనాథ్ హైవేపై పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సమయంలో బద్రీనాథ్ ధామ్, హేమకుండ్ సాహిబ్లకు వెళ్లే దాదాపు 300 మంది భక్తులు చిక్కుకుపోయారు.
RG Kar Case | కేసును తొక్కిపెట్టేందుకు పోలీసుల లంచం..! ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రుల సంచలన ఆరోపణలు..!