Harish Rao | సిద్దిపేట : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పసి పిల్లల నుంచి మొదలుపెడితే పండు ముసలోళ్ల వరకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఫలాలు అందుకున్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేశారు. ఈ సంక్షేమ పథకాల్లో ప్రధానమైనది కళ్యాణలక్ష్మి. కేసీఆర్ హయాంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పెళ్లైన నెల రోజుల్లోనే లబ్దిదారులకు అందించేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి నెలల సమయం పడుతోంది.
సిద్దిపేటలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కోసం రాష్ట్ర హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. చెక్కులు ఇద్దామంటే ప్రభుత్వ పెద్దలు ఎవరూ సహకరించడం లేదని పేర్కొన్నారు. లబ్దిదారుల కోసం తానే స్వయంగా హైకోర్టుకు వెళ్లి కేసు వేసి ఆర్డర్ తీసుకొచ్చానని గుర్తు చేశారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ఉడతా భక్తి సహాయం చేయడం కోసం కేసీఆర్ ప్రారంభించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని హరీశ్‌రావు మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వీలైనంత త్వరగా కళ్యాణలక్ష్మి లబ్దిదారులకు తులం బంగారం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయితే బాలింతలకు ఇచ్చే కేసీఆర్ కిట్ కూడా బంద్ అయిందని తెలిపారు. సిద్దిపేట ప్రజల కోసం జీవితంలో మొదటిసారి హైకోర్టు మెట్లెక్కి చెక్కులు పంపిణీ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Encounter | భద్రాద్రి జిల్లాలో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
Harish Rao | రాష్టంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన: హరీశ్‌రావు