Silver price | బంగారు (Gold), వెండి (Silver) ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా వెండి మరో చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకింది. శుక్రవారం వెండి ధరలు (Silver price) దాదాపు 5శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 75 డాలర్ల మార్క్‌ను దాటింది. ఫలితంగా భారత్‌లోనూ వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇవాళ ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ.2,37,000 పలుకుతోంది. ఈ నెల 18వ తేదీ నుంచి ఇప్పటి వరకూ వెండి ధర దాదాపు 14 శాతం పెరిగింది. అటు బంగారం ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఇవాళ ఉదయం 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10గ్రాముల బంగారం ధర రూ.1.40 లక్షలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,28,350గా నమోదైంది.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వెండి ఏకంగా రూ.1,37,300 లేదా 153 శాతం ఎగబాకింది. గతేడాది డిసెంబర్ 31న రూ.89,700గా ఉన్న కిలో ధర ప్రస్తుతం రూ.2 లక్షలు దాటింది. డాలర్ బలహీనంగా ఉండటం, అమెరికా ఫెడరల్ రిజర్వు వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లడం, ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Also Read..
UP Man Kills Wife | రహస్యంగా మొబైల్ వాడుతోందని.. భార్యను హత్య చేసి.. దృశ్యం సినిమాను తలపించే సీన్
Railway Ticket Fares | ప్రయాణికులకు అలర్ట్.. పెంచిన రైలు చార్జీలు నేటి నుంచి అమల్లోకి