Railway Ticket Fares | రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వారం ప్రారంభంలో రైల్వే టికెట్ చార్జీలు (Railway Ticket Fares) రైల్వే శాఖ పెంచిన విషయం తెలిందే. పెరిగిన చార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. 215 కిలోమీటర్ల ప్రయాణం వరకు జనరల్ క్లాస్ టికెట్ ధరల్లో ఎలాంటి మార్పులూ లేవు. అయితే, 216 కిలోమీటర్ల నుంచి 750 కిలోమీటర్ల మధ్య ప్రయాణించే ప్రయాణీకులు అదనంగా రూ.5 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 751 కి.మీ నుంచి 1,250 కి.మీ వరకు ప్రయాణించే వారు రూ.10, అదే 1,251 కి.మీ నుంచి 1,750 కి.మీ మధ్య ప్రయాణాలకు రూ.15 అదనంగా, 1,751 కి.మీ నుంచి 2,250 కి.మీ వరకు దూరాలకు రూ.20 అదనపు భారం పడనుంది.
ఇక స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ చార్జీలు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెరిగాయి. మెయిల్/ఎక్స్‌ప్రెస్ (నాన్-ఏసీ, ఏసీ క్లాసులు) రైళ్లలో స్లీపర్, ఏసీ చైర్ కార్, ఏసీ 3-టైర్, 2-టైర్, ఫస్ట్ క్లాస్‌తో పాటు రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి అన్ని ప్రీమియం రైళ్లలో కిలోమీటర్‌కు 2 పైసల చొప్పున ఛార్జీలు పెరిగాయి. ఈ పెంపు వల్ల సంవత్సరానికి రూ.600 కోట్ల ఆదాయం రైల్వేలకు సమకూరుతుంది. సబర్బన్ రైలు ప్రయాణ చార్జీలు యథాతథంగా కొనసాగనున్నాయి. తాజా పెంపుతో ఈ ఏడాది రైల్వే శాఖ టికెట్ ధరలను రెండుసార్లు పెంచినట్లైంది. డిసెంబర్ 26కు ముందే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఈ చార్జీలు వర్తించవు. నేటి నుంచి టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే కొత్త చార్జీలు వర్తిస్తాయి.
Also Read..
బైక్‌లు, కార్లు, థాయ్‌లాండ్ ట్రిప్‌లు!
పెండ్లి చేసుకోవడానికి సిద్ధమే కాని..
విద్యుత్తు కోతలతో విసుగెత్తి..