హరిద్వార్, డిసెంబర్ 25: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో విద్యుత్తు కోతలతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. దీంతో ఒళ్లుమండిన ఎమ్మెల్యే ఒకరు స్వయంగా కరెంట్ పోల్ ఎక్కి ముగ్గురు విద్యుత్తు శాఖ ఉన్నతాధికారుల ఇళ్లకు విద్యుత్తు సరఫరాను కట్ చేశారు. దీంతో ఎమ్మెల్యేపై ఆ శాఖ అధికారులు రూర్కీ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తమ నియోజకవర్గంలో తీవ్రంగా విద్యుత్తు కోతలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జబ్రేడాకు చెందిన ఎమ్మెల్యే వీరేందర్ జతి మంగళవారం తన మద్దతుదారులతో వచ్చి స్వయంగా కరెంట్ పోల్స్‌కు నిచ్చెనవేసుకుని ఎక్కి విద్యుత్తు శాఖ సీఈ, ఎస్ఈ, ఈఈల ఇళ్లకు విద్యుత్ సరఫరాను కట్ చేశారు. ప్రజల బాధ వారూ అనుభవించాలని అన్నారు.