Ram Mohan Naidu: స్వదేశీ విమాన సంస్థలకు కీలక మార్గదర్శకాలు జారీ
Ram Mohan Naidu: డీజీసీఏ కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. విమానాల్లో 60 శాతం సీట్లకు అదనపు ఛార్జీలు వసూల్ చేయరాదు అని చెప్పింది. ఒకే పీఎన్ఆర్ నెంబర్‌పై ఉన్న ప్రయాణికులు పక్కపక్కనే కూర్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. మంత్రి రామ్మోహన్ నాయుడు తన ఎక్స్‌లో దీనిపై ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: స్వదేశీ విమాన ప్రయాణికులకు భారీ ఊరట కల్పించింది కేంద్ర ప్రభుత్వం. స్వదేశీ విమానాల్లో 60 శాతం సీట్లపై అదనపు ఛార్జీలు వసూల్ చేయరాదు అని ఎయిర్‌లైన్స్ సంస్థలను ఆదేశించింది. ఇక ఒకే పీఎన్ఆర్ నెంబర్ మీద ప్రయాణం చేస్తున్న కుటుంబసభ్యలు ఒకే దగ్గర కూర్చునేలా ఏర్పాటు చేయాలని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ తన మార్గదర్శకాల్లో వెల్లడించింది. ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందించే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) వెల్లడించారు. విమాన ప్రయాణానికి చెందిన కొత్త మార్గదర్శకాలను ఇవాళ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది.
ప్రతి ప్రయాణికుడికి ఫెయిర్ యాక్సెస్ ఉండేందుకు.. 60 శాతం సీట్లకు బుకింగ్ సమయంలో ఎటువంటి అదనపు ఛార్జీలు వసూల్ చేయవద్దు అని డీజీసీఏ పేర్కొన్నది. ప్రస్తుతం కేవలం 20 శాతం సీట్లు మాత్రమే ఎటువంటి ఛార్జీలు లేకుండా సీట్లు బుక్ చేసుకునే అవకాశం ఉన్నది. ఒకే పీఎన్ఆర్ నెంబర్‌పై ప్రయాణించే వారు.. వీలైనంత వరకు పక్కపక్క సీట్లలో కూర్చునేందుకు అవకాశం ఇవ్వాలని విమానయాన శాఖ తెలిపింది. కేవలం స్వదేశీ విమానాలకు మాత్రమే ఈ కొత్త మార్గదర్శకాలు వర్తించనున్నట్లు అధికారులు చెప్పారు.
సీట్లను బుక్ చేసుకునే సమయంలో.. కొన్ని విమాన సంస్థలు .. కొన్ని తరహా సీట్లకు అధిక ఛార్జీలు వసూల్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలు రిలీజ్ చేశారు. విమాన ప్రయాణికుల సౌకర్యం కోసం కొన్ని చర్యలు చేపట్టినట్లు ఇవాళ సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు. ఆలస్యం జరిగినా, విమానం రద్దు అయినా.. అలాంటి కేసులను కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. స్వదేశీ విమాన సేవల్లో ప్రపంచంలోనే భారత్ మూడవ స్థానంలో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Under the transformational leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi Ji, India has established itself as the world’s third-largest domestic aviation market.
Supported by the UDAN scheme, air travel in India has evolved from being an elite privilege to an inclusive… pic.twitter.com/gbr2YmROIb
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) March 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

