గాలె : సొంతగడ్డపై భారత్‌తో ఈనెల 15 నుంచి జరుగబోయే తొలి టెస్టుకు శ్రీలంక తమ జట్టును ప్రకటించింది. ధనంజయ డి సిల్వ సారథ్యంలోని 16 మంది సభ్యులు గల ఈ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెలాతో పాటు అన్క్యాప్డ్ ఆఫ్ స్పిన్నర్ నువాంత కేశర చోటు దక్కించుకున్నారు.
2023లో న్యూజిలాండ్‌తో చివరగా టెస్టు ఆడిన డిక్వెలా.. రెగ్యులర్ వికెట్‌కీపర్ కుశాల్ మెండిస్ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకోవడంతో 33 ఏండ్ల వయసులో అవకాశాన్ని దక్కించుకున్నాడు. వీరితో పాటు యువ బ్యాటర్ పసిందు సూరియబండారా, లెఫ్టార్మ్ పేసర్ దిల్షాన్ మధుశంక సైతం జట్టులోకి వచ్చారు.