ఢిల్లీ : కొద్దిరోజుల క్రితం టీమిండియాతో వన్డే సిరీస్ ఆడేందుకు ఇక్కడకు వచ్చిన అఫ్గానిస్థాన్.. వచ్చేనెలలో మరోసారి భారత్‌కు రానుంది. సెప్టెంబర్‌లో మెన్ ఇన్ బ్లూతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పోటీపడేందుకు కాబూలీలు భారత్‌కు రానున్నారు.
ఈ మేరకు బీసీసీఐ, అఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) బుధవారం సంయుక్తంగా ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించాయి. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఇరుజట్లూ ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా మూడు టీ20లు ఆడతాయని తెలిపాయి.