కారేపల్లి, సెప్టెంబర్ 29 : కారేపల్లి జడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజన పథకం అమలును జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, వంటశాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. వంట నిర్వాహకులు పరిశుభ్రత పాటించాలని, చేతులకు గ్లౌజులు ఉపయోగించి వంట చేసి విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. తరగతి గదుల సీలింగ్ మరమ్మతులు చేపట్టడంతో పాటు మరుగుదొడ్లకు అవసరమైన మరమ్మతులు చేయించాలని, విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాలకు ప్రహరీ ఏర్పాటు చేయాలని ప్రధానోపాధ్యాయుడు సల్మాన్ రాజ్ డీడబ్ల్యూఓకు వినతిపత్రం ద్వారా కోరారు. సమస్యలను పరిశీలించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఆమె వెంట కామేపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో కె.ఉమా, సూపర్వైజర్ సత్య శీలా, విజయలక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు సల్మాన్ రాజ్ ఉన్నారు.

కారేపల్లి జడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజనం తనిఖీ