Railway Ticket Fares | రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వారం ప్రారంభంలో రైల్వే టికెట్ చార్జీలు (Railway Ticket Fares) రైల్వే శాఖ పెంచిన విషయం తెలిందే. పెరిగిన చార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
ఆరు నెలల వ్యవధిలో రైల్వే శాఖ మరోసారి ప్రయాణికుల చార్జీలు పెంచింది. పెరిగిన చార్జీలు ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. సబర్బన్ రైలు ప్రయాణ చార్జీలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.