Dhurandhar | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల క్లబ్లో చేరి భారతీయ సినిమా రికార్డులను తిరగరాసింది. విడుదలైన కేవలం 21 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1006.7 కోట్ల (గ్రాస్) వసూళ్లను సాధించినట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఇప్పటివరకు ఇండియాలో రూ. 789.18 కోట్ల గ్రాస్ (రూ. 633.5 కోట్ల నెట్) వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో రూ. 217.5 కోట్ల మార్కును దాటి దూసుకుపోతోంది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి 10 భారతీయ చిత్రాల జాబితాలో ‘ధురంధర్’ 9వ స్థానంలో నిలిచింది. అలాగే రణబీర్ కపూర్ ‘యానిమల్’ రికార్డులను ఈ చిత్రం అధిగమించింది.
‘ఉరి’ వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన ఆదిత్య ధర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. రణ్వీర్ సింగ్తో పాటు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్ వంటి దిగ్గజ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. 1999 కాందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి వంటి యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మరోవైపు ఈ సినిమా సీక్వెల్ వచ్చే ఏడాది మార్చి 19న ఈద్ కానుకగా విడుదల కాబోతుంది. మొదటి భాగం కేవలం హిందీలోనే సంచలనం సృష్టించగా, రెండో భాగాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేయనున్నారు.
Entering the 1000 CR club, loud and proud.
Book your tickets. (Link in bio)
🔗 – https://t.co/cXj3M5DFbc#Dhurandhar Frenzy Continues Worldwide.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol @AdityaDharFilms #JyotiDeshpande… pic.twitter.com/wAk2IklWT5— Jio Studios (@jiostudios) December 26, 2025