Rythu Bharosa | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ చర్చించింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు అధికారులు హాజరై, రైతు భరోసా విధివిధానాలపై చర్చించారు. ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో రైతు భరోసా అమలుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
పంట సాగు చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైతు భరోసాకు ఐటీ చెల్లింపు, భూమి పరిమితి పెట్టొద్దని కమిటీ అభిప్రాయ పడినట్లు సమాచారం. రైతు భరోసా అమలు కోసం కొత్తగా రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములు గుర్తించాలని నిర్ణయించారు. సంక్రాంతి పండుగ(జనవరి 14) నుంచి రైతు భరోసా అమలు చేసే అవకాశం ఉంది. ధరణి ప్రకారం కోటి 53 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు సమాచారం. సాగు చేయని భూములు తీసేస్తే కోటి 30 లక్షల ఎకరాలకు రైతు భరోసా అందే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
Vinod Kumar | తెలంగాణ హైకోర్టులో జడ్జిల నియామకానికి చర్యలు చేపట్టాలి : వినోద్ కుమార్
Siricilla | అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని విద్యార్థిపై దాడి.. మనస్తాపంతో ఆత్మహత్య
Deepthi Jeevanji | ఓరుగల్లు ముద్దుబిడ్డ జీవాంజి దీప్తికి అర్జున అవార్డు