రాజన్న సిరిసిల్ల : అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్(New Year Celebrations) చెప్పాడమే ఆ విద్యార్థి పాలిట శాపమైంది. ఎంతో ఉత్సాహంగా తన క్లాస్‌మేట్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు సదరు విద్యార్థిపై దాడి చేశారు. దీంతో మనస్థాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు(Student suicide) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శివకిశోర్ అనే10వ తరగతి విద్యార్థి న్యూ ఇయర్(బుధవారం) సందర్భంగా తన క్లాస్మేట్ అమ్మాయికి విషెస్ చెప్పాడు. కాగా, మా అమ్మాయికి విషెస్ చెప్తావా అని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు శివకిశోర్‌పై దాడి చేశారు. మనస్థాపానికి గురైన శివ కిశోర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య విషయం తెలుసుకొని అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.