Deepthi Jeevanji | హైదరాబాద్ : పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన ఓరుగల్లు ముద్దుబిడ్డ, పారా అథ్లెట్ జీవాంజి దీప్తికి అర్జున అవార్డు వరించింది. దీంతో జీవాంజి దీప్తితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, వరంగల్ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. జీవాంజి దీప్తికి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఈ నెల 17వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును జీవాంజి దీప్తి అందుకోనున్నారు. ఇవాళ కేంద్రం ప్రకటించిన జాతీయ క్రీడా అవార్డుల్లో జీవాంజి దీప్తికి చోటు దక్కింది. నలుగురికి ఖేల్‌రత్న, 32 మందికి అర్జున అవార్డులు, ఐదుగురికి ద్రోణాచార్య అవార్డులను కేంద్రం ప్రకటించింది.
పారా ఒలింపిక్స్‌లో భాగంగా మహిళల 400 మీటర్ల T20లో ఫైనల్లో 55.82 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ రికార్డుతో కాంస్య పతకాన్ని సాధించింది. తెలంగాణకు తొలిసారిగా ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించి పెట్టింది. దీప్తి స్వస్థలం వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం.
ఇవి కూడా చదవండి..
BCCI | ఆస్ట్రేలియా ప్రధానిని కలిసిన టీమ్ ఇండియా.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
Khel Ratna Award | ఆ నలుగురికి ఖేల్‌రత్న అవార్డులు ప్రకటించిన కేంద్రం
Rishabh Pant: రిషబ్ పంత్‌పై వేటు పడే ఛాన్స్.. అతని స్థానంలో కీపర్ ఎవరంటే