సిడ్నీ: సిడ్నీ టెస్టులో కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) ఆడేది అనుమానంగా ఉంది. ఇటీవల అతని పర్ఫార్మెన్స్పై దృష్టి పెట్టిన మేనేజ్మెంట్.. కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మెల్బోర్న్లో జరిగిన నాలుగవ టెస్టులో.. పంత్ రెండు సార్లు తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. నిర్లక్ష్యపూరిత షాట్లు కొట్టి అవుటయ్యాడు. దీన్ని టీమ్ మేనేజ్మెంట్ సీరియస్‌గా పరిగణిస్తోంది. ఆసీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో పంత్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు.
స్టార్టింగ్ ఇచ్చినా వాటిని భారీ స్కోర్లుగా పంత్ మలుచుకోలేకపోయాడు. 20, 30 పరుగులు చేసి నిర్లక్ష్యంగా అవుట్ అవుతున్నాడు. దీంతో పంత్‌ను అయిదో టెస్టుకు తప్పించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫైనల్ టెస్టుకు పంత్ స్థానంలో ద్రువ్ జురెల్‌కు చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇండియా ఏ జట్టు తరపు ఆడిన జురెల్ 80, 68 రన్స్ స్కోర్ చేశాడు.