Hrithik Roshan | ‘క్రిష్ 4’ మరింత ఆలస్యం .. ముందుగా హోంబళే ప్రాజెక్ట్‌పై హృతిక్ ఫోకస్
Hrithik Roshan | బాలీవుడ్ గ్రీక్ గాడ్‌గా పేరుగాంచిన హృతిక్ రోషన్ ఇటీవల భారీ యాక్షన్ చిత్రం వార్2 చిత్రంతో పాన్ ఇండియా ఆడియెన్స్‌ను అలరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత హృతిక్ లైనప్ మరింత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సూపర్ హీరో చిత్రం క్రిష్4పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Hrithik Roshan | బాలీవుడ్ గ్రీక్ గాడ్‌గా పేరుగాంచిన హృతిక్ రోషన్ ఇటీవల భారీ యాక్షన్ చిత్రం వార్2 చిత్రంతో పాన్ ఇండియా ఆడియెన్స్‌ను అలరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత హృతిక్ లైనప్ మరింత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సూపర్ హీరో చిత్రం క్రిష్4పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ‘క్రిష్ 4’ ప్రారంభం కొంతకాలం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను హృతిక్ స్వయంగా దర్శకత్వం వహించనున్నట్లు ముందుగా ప్రకటించబడింది. కానీ ప్రస్తుతం ఆయన దృష్టి మరో భారీ ప్రాజెక్ట్‌పై కేంద్రీకృతమైందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
హృతిక్ తన కెరీర్లో తొలిసారి దక్షిణ భారత నిర్మాణ సంస్థతో పని చేయబోతున్నాడు. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబళే ఫిలింస్‌తో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ మేళవింపుగా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను ముందుగా పూర్తి చేయాలనే ఆలోచనలో హృతిక్ ఉన్నాడట. అందువల్ల ‘క్రిష్ 4’ పనులు ఆ తర్వాతే ప్రారంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ హీరో ఫ్రాంచైజ్‌కు ఇది చిన్న నిరాశే అయినా, హోంబళే బ్యానర్‌తో హృతిక్ చేసే ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.
‘కోయి మిల్ గయా’తో ప్రారంభమైన క్రిష్ ఫ్రాంచైజ్ బాలీవుడ్లో సూపర్ హీరో జానర్‌కు కొత్త దారి చూపించింది. ‘క్రిష్’, ‘క్రిష్ 3’ చిత్రాల విజయంతో ఈ సిరీస్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు నాలుగో భాగం ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి మరింత పెరిగింది. విజువల్ ఎఫెక్ట్స్, కథ, యాక్షన్ సీక్వెన్స్‌ల పరంగా ఈ చిత్రం మరింత భారీగా ఉండనుందని గతంలో సమాచారం వచ్చింది. అయితే ప్రస్తుతం హృతిక్ ఫోకస్ హోంబళే ప్రాజెక్ట్‌పైనే ఉందని తెలుస్తోంది. ఆ సినిమా పూర్తయిన తర్వాతే ‘క్రిష్ 4’పై అధికారిక ప్రకటన రావచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి, ‘క్రిష్ 4’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు కొంత నిరీక్షణ తప్పదనిపిస్తోంది. కానీ హోంబళే ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. దానిపై క్లారిటీ వచ్చిన తర్వాతే హృతిక్ తదుపరి ప్లాన్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

