Toxic | టాక్సిక్ నుంచి ‘తబాహి’.. కియారా-యశ్ కెమిస్ట్రీతో హీటెక్కుతున్న సోషల్ మీడియా
Yash - Kirara | పాన్ ఇండియా స్టార్ నటుడు యశ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'టాక్సిక్' (Toxic) నుంచి తాజాగా విడుదలైన పోస్టర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Yash – Kirara | పాన్ ఇండియా స్టార్ నటుడు యశ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ (Toxic) నుంచి తాజాగా విడుదలైన పోస్టర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని మొదటి పాట ‘తబాహి’ (Tabaahi) కి సంబంధించి మేకర్స్ విడుదల చేసిన రొమాంటిక్ అప్డేట్స్ ఇప్పుడు ఫ్యాన్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘తబాహి’ని మార్చి 2న మధ్యాహ్నం 12:59 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో యశ్ షర్ట్‌లెస్ లుక్‌లో కనిపిస్తుండగా, కియారా అద్వానీ ఆయనను బిగి కౌగిలిలో బంధించిన రొమాంటిక్ స్టిల్ ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. సముద్రపు తీరంలో సూర్యాస్తమయ వేళ వీరిద్దరి కెమిస్ట్రీ పోస్టర్లలో పీక్స్‌లో కనిపిస్తోంది.
ఈ సినిమాలో యశ్ ‘రాయ’ అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తుండగా, కియారా అద్వానీ ‘నదియా’గా కనిపించనుంది. వీరు కాకుండా నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా మరియు రుక్మిణి వసంత్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 1940 – 70ల మధ్య గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నట్లు సమాచారం.
12:59 PM | March 2nd #Tabaahi #ToxicTheMovie#Nayanthara @advani_kiara@humasqureshi @rukminitweets #TaraSutaria #GeetuMohandas @VishalMMishra @yogarajofficial @rajshekharis @ramjowrites #VigneshShivan #RafeeqAhammed #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere… pic.twitter.com/8hP7rM4otG
— Yash (@TheNameIsYash) February 28, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

