మంత్రి జూపల్లి మేనల్లుడిపై ఫిర్యాదు
మంత్రి జూపల్లి కృష్ణారావు మేనల్లుడు సతీశ్రావు కనపర్తి (ఎన్నారై)పై సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సీనియర్ సిటిజన్ జలగం రంగారావు, ఆయన కుమారుడు జలగం సుధీర్ సూర్యాపేట ఎస్పీ నర్సింహకు శుక్రవారం ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
- 40 లక్షల బకాయి చెల్లిస్తలేరని బాధితుడి ఆవేదన ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల
- బదిలీలపై సతీశ్రావుపై సమగ్ర విచారణ జరుపాలి
- ఎస్పీకి సూర్యాపేట జిల్లావాసి జలగం ఫిర్యాదు
కోదాడ, నవంబర్ 20 : మంత్రి జూపల్లి కృష్ణారావు మేనల్లుడు సతీశ్రావు కనపర్తి (ఎన్నారై)పై సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సీనియర్ సిటిజన్ జలగం రంగారావు, ఆయన కుమారుడు జలగం సుధీర్ సూర్యాపేట ఎస్పీ నర్సింహకు శుక్రవారం ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. వ్యాపార అవసరాల నిమిత్తం 2017 నుంచి 2021 మధ్య విడతల వారీగా సుమారు రూ.60 లక్షలు అప్పుగా ఇచ్చామని, కొంత మొత్తం తిరిగి వచ్చినప్పటికీ ఇంకా సుమారు రూ. 40 లక్షలు బకాయి ఉన్నదని జలగం రంగారావు, జలగం సుధీర్ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్లో లక్ష్యాస్ పేరుతో సహజ ఆహార ఉత్పత్తులు, సేంద్రియ కూరగాయల వ్యాపారం ప్రారంభిస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్నట్టు తెలిపారు.
తిరిగి చెల్లిస్తానని ఈ-మెయిల్స్ ద్వారా పలుమార్లు హామీ ఇచ్చినప్పటికీ పూర్తిస్థాయి చెల్లింపులు జరగలేదని పేర్కొన్నారు. బకాయిల విషయంలో 2021-23 మధ్య మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా చెల్లింపులకు హామీ ఇచ్చారని, అయితే సుమారు రూ.40 లక్షల బకాయిలో రూ.3 లక్షలు మాత్రమే అందినట్టు వారు పేర్కొన్నారు. తన బంధువు ద్వారకానాథ్ కూడా రూ.పది లక్షలు ఇస్తే ఇటీవల రూ. 20 వేలు మాత్రమే తిరిగి చెల్లించారని పేర్కొన్నారు. గతంలో భరోసాగా చూపిన కొన్ని ఆస్తులు ఇతర కుటుంబ సభ్యుల పేర్లకు బదిలీ అయినట్టు వారు అనుమానం వ్యక్తంచేశారు. బ్యాంకు లావాదేవీలు ఈ-మెయిల్ హామీలు, ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలపై విచారణ జరపాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

