టన్నుల కొద్దీ వ్యర్థాలు
వందేండ్ల చరిత్ర కలిగిన జంట జలాశయాల నీటి స్వచ్ఛతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
- జంట జలాశయాలు
- కుప్పలు తెప్పలుగా చెత్త.. ప్లాస్టిక్ కవర్లు..
- ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ స్వచ్ఛతపై నీలినీడలు
- తగ్గుతున్న నీరు.. నిమజ్జన విగ్రహాల అవశేషాలు సైతం బయటకు ..
సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): వందేండ్ల చరిత్ర కలిగిన జంట జలాశయాల నీటి స్వచ్ఛతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తుండటంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లలో నీటిమట్టం వేగంగా తగ్గుతూ వస్తున్నది. నీరు తగ్గుతున్న కొద్దీ టన్నుల కొద్దీ వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు కుప్పలు తెప్పలుగా బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. నిమజ్జనం చేసిన విగ్రహాల అవశేషాలు సైతం దర్శనమిస్తుండటం అధికారుల పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతున్నది.
కుప్పలు తెప్పలుగా చెత్త.. ప్లాస్టిక్ కవర్లు, గృహ వ్యర్థాలు.. వందల సంఖ్యలో నిమజ్జనం చేసిన ప్రతిమలు.. కాలువల నుంచి వస్తున్న మురుగు వ్యర్థ జలాలు.. ఇదీ జంట జలాశయాల దుస్థితి. వర్షాభావ పరిస్థితులు జలమండలి నిర్లక్ష్యాన్ని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాయి. ఇప్పటికే వర్షాకాలం కాకున్నా నగరంలోని పలు చోట్ల తాగునీరు కలుషితమై సరఫరా అవుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

సిటీ బ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): జలమండలి పరిధిలోని ఎస్టీపీలు శుద్ధి చేసిన నీటిని తాకిన ఎయిర్ టెక్ మిషన్ల కార్మికులకు చర్మ సమస్యలు తలెత్తుతుండటం కలవరపెడుతున్నది. ఈ నేపథ్యంలో వందేండ్లుగా నగరానికి తాగునీరు అందిస్తున్న జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నీటి స్వచ్ఛతపై నీలినీడలు అలుముకుంటున్నాయి. వర్షా లు పడకపోవడంతో ఇప్పటికే జంట జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణం కంటే తక్కువగా ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తుండటంతో రెండు రిజర్వాయర్లలో నీరు వేగంగా తగ్గుతూ వస్తుంది.
నీరు తగ్గుతున్న కొద్దీ జలమండలి అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు అవుతున్నది. ఇన్నాళ్లుగా జలాశయాల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పడేసిన గృహవ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, నిమజ్జనాలు చేసిన వినాయక, దుర్గామాత విగ్రహాల అవశేషాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా గండిపేటలోని ఉస్మాన్‌సాగర్‌లో టన్నుల కొద్దీ వ్యర్థాలు బయటకు వస్తున్నాయి. చెరువులో నీళ్లు తగ్గుతుండటంతో వందల సంఖ్యలో వినాయక, దుర్గామాత విగ్రహాలు తేలుతున్నాయి. ముఖ్యంగా గండిపేట నుంచి ఖానాపూర్ మధ్యలో శంకర్పల్లి-నార్సింగి ప్రధాన రహదారిపై వెళ్తుంటే వ్యర్థాలు రోడ్డుపైకి కనిపిస్తుండటంతో ప్రజలు నీటి స్వచ్ఛతపై ఆందోళన చెందుతున్నారు.
మొద్దు నిద్రలో అధికారులు..

మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న జంట జలాశయాల పర్యవేక్షణలో అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. ఏండ్ల తరబడిగా శివారు ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు గృహ వ్యర్థాలతో పాటు వినాయక నిమజ్జనాలు చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కనీస పర్యవేక్షణ లేకపోవడంతో సెప్టిక్ వ్యర్థాలు, మురుగు కూడా చేరుతున్నది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ చుట్టూ ఉన్న గ్రామాల మురుగు నీరు కూడా వచ్చి చేరుతున్నది. కానీ జలమండలి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారు. కనీస భద్రత చర్యలు చేపట్టకపోగా జలాశయాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఉన్నతాధికారులు జలాశయ ముఖద్వారం దగ్గరకు వచ్చి నీటి నిల్వ, సామర్థ్యం చూసి వెళ్తున్నారు… కానీ ఎన్నడూ జంట జలాశయాల సంరక్షణపై మాత్రం దృష్టిసారించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రెండు జలాశయాల పరిధిలో ఉన్న అధికారులు కూడా సిబ్బందితో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయించడంలోను నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో రెండు రిజర్వాయర్లు కాలుష్యపు కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికైనా జలమండలి ఉన్నతాధికారులు చొరవ తీసుకుని జలాశయాల్లో పేరుకుపోయిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్, గృహ వ్యర్థాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
వ్యర్థాలను అక్రమంగా జలాశయాల్లో పడవేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సిటీకి ఈరెండు జలాశయాల నుంచి అదనపు జలాలను తీసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో.. కలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

