సుప్రీంకోర్టులోనూ రైస్ మిల్లర్లకు చుక్కెదురు
ధాన్యం సేకరణకు సహకరించకుండా డిఫాల్టర్లయిన రైస్‌మిల్లర్లకు సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మిల్లర్లు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం డిస్మిస్ చేసింది. గతంలో రాష్ట్ర హైకోర్టు కూడా మిల్లర్ల విషయంలో ఇదే తరహా తీర్పు ఇచ్చింది.
- స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్
- మిల్లర్లు తక్షణమే సీఎంఆర్ ఇవ్వాలి
- లేదంటే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం : సివిల్ సైప్లె అధికారులు
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ధాన్యం సేకరణకు సహకరించకుండా డిఫాల్టర్లయిన రైస్‌మిల్లర్లకు సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మిల్లర్లు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం డిస్మిస్ చేసింది. గతంలో రాష్ట్ర హైకోర్టు కూడా మిల్లర్ల విషయంలో ఇదే తరహా తీర్పు ఇచ్చింది. తమపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని కోరుతూ మిల్లర్లు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను తాజాగా సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది. 2022 వానకాలం, యాసంగికి సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్‌మిల్లర్లకు అప్పగించింది. . అయితే, చాముండేశ్వరీ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కాసం సాత్విక్‌తోపాటు మరికొందరు మిల్లర్లుప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు.
దీనిపై నిఘా పెట్టిన అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బియ్యం దుర్వినియోగం అయినట్టు గుర్తించారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి పోలీసుస్టేషన్లో కాసం సాత్విక్‌పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా సీఎంఆర్ తీసుకున్న మిల్లులన్నింటిపై అధికారులు ప్రత్యేక దాడులు చేశారు. రూ.3,960 కోట్ల విలువైన ధాన్యం దుర్వినియోగం అయినట్టు గుర్తించారు. దీంతో మొత్తం 540 ఎఫ్ఐఆర్లు మిల్లర్లపై నమోదయ్యాయి. ఈ ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలంటూ కాసం సాత్విక్, గట్టు శ్రవణ్, కొండా వెంకన్న సహా 57 మంది రైస్‌మిల్లర్లు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు మిల్లర్ల వాదనతో ఏకీభవించలేదు. దీంతో సాత్విక్, గట్టు శ్రవణ్, కొండ వెంకన్న వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లను సుప్రీంకోర్టులో జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషినర్ల వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. దీంతో పిటిషనర్ల తరఫు న్యాయవాది స్పందిస్తూ తమకు పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
మిల్లర్లు సీఎంఆర్‌లో మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. మిల్లర్లు తమకు ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌కు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 2200కుపైగా మిల్లర్లకు సీఎంఆర్ కింద ధాన్యం ఇచ్చామని, కొందరు రైస్‌మిల్లర్లు బియ్యం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేశారని, అలాంటివారిపై పోలీసు కేసులు నమోదు చేశామని తెలిపారు. డిఫాల్టర్లు తక్షణమే పౌరసరఫరాల సంస్థకు ఇవ్వాల్సిన బియ్యం లేదా బకాయిలు చెల్లించాలని పౌరసరఫరాల శాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిల్లర్లు పీడీఎస్ బియ్యం, రైతుల నుంచి సేకరించి ఇచ్చిన ధాన్యం విషయంలో ఏమైనా అక్రమాలకు పాల్పడితే వారిపై రెవెన్యూ రికవరీ చట్టం ఉపయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

