Sonal Chauhan | దుబాయ్‌లో చిక్కుకున్న సోనాల్ చౌహాన్, పి.వి. సింధు.. సాయం కోరుతూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి!
Sonal Chauhan | మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన భారతీయ నటి సోనాల్ చౌహాన్, తనను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
Middle East Crisis | మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన భారతీయ నటి సోనాల్ చౌహాన్, తనను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య దాడులు తీవ్రతరం కావడంతో గల్ఫ్ దేశాల మీదుగా విమాన రాకపోకలను భారత్ నిలిపివేసింది. దీంతో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది.
అయితే తన పరిస్థితిని ప్రధానికి సోషల్ మీడియా వేదికగా సోనల్ వివరిస్తూ.. “గౌరవనీయులైన ప్రధాని మోదీ గారు, ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం వల్ల నేను దుబాయ్‌లో చిక్కుకుపోయాను. విమానాలన్నీ రద్దయ్యాయి, భారత్‌కు తిరిగి రావడానికి మార్గం కనిపించడం లేదు. ప్రభుత్వం స్పందించి తగిన మార్గదర్శకాలు అందించి, నేను క్షేమంగా ఇంటికి చేరుకునేలా సహాయం చేయాలని కోరుతున్నాను” అని సోనాల్ చౌహాన్ పోస్ట్ చేశారు.
కేవలం సోనాల్ మాత్రమే కాకుండా, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు కూడా తన బృందంతో కలిసి దుబాయ్ ఎయిర్‌పోర్టులోనే ఆగిపోయారు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టోర్నమెంట్ కోసం బర్మింగ్‌హామ్ వెళ్తుండగా, దుబాయ్‌లో విమానాలు నిలిచిపోయాయని ఆమె తెలిపారు. ఎయిర్పోర్ట్ సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, పరిస్థితి భయాందోళనకరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం తమను సురక్షిత ప్రాంతానికి తరలించారని, భారత రాయబార కార్యాలయం తమతో టచ్‌లో ఉందని సింధు వెల్లడించారు. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఎయిర్ ఇండియా సహా పలు అంతర్జాతీయ సంస్థలు తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

