గంజాయి, వీడ్ ఆయిల్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
ఒడిశా నుండి గంజాయి, వీడ్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది అంతరాష్ట్ర ముఠాను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి రూ.10 లక్షల విలువైన 5.6 కిలోల గంజాయి, 100 ML వీడ్(హాష్) ఆయిల్, 5 బైక్‌లు, 4 సెల్ఫోన్లు, డమ్మీ తుపాకీ, బట్టన్ చాకు స్వాధీనం చేసుకున్నారు.
నీలగిరి, జూలై 25 : ఒడిశా నుండి గంజాయి, వీడ్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది అంతరాష్ట్ర ముఠాను నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి రూ.10 లక్షల విలువైన 5.6 కిలోల గంజాయి, 100 ML వీడ్(హాష్) ఆయిల్, 5 బైక్‌లు, 4 సెల్ఫోన్లు, డమ్మీ తుపాకీ, బట్టన్ చాకు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి శనివారం వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11:00 గంటలకు నల్లగొండ పట్టణం మునుగోడు బైపాస్ రోడ్డులోని ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కొంతమంది యువకులు గుమిగూడి గంజాయిని విక్రయిస్తూ, వినియోగిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో నల్లగొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో రైడ్ చేసి 8 మందితో పాటు ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
అదుపులోకి తీసుకున్న నిందితులను కస్పరాజు నాగరాజు(20), గంటెకంపు మధు(22), చెన్నపాక సుశాంక్(23), పెండ్ర వాసు(19), సయ్యద్ షోయబ్(21), గంధం శివమణి(19), నకిరేకంటి ధరణి కుమార్(19)గా గుర్తించినట్లు వీరితో పాటు ఓ బాలుడు ఉన్నట్లు వెల్లడించారు. కాగా మనుకర్ నివాసం, హరి నివాసం, ఉదయ్, జున్ను పరారీలో ఉన్నట్లు చెప్పారు. కేసును చాకచక్యంగా నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి గారి పర్యవేక్షణలో ఛేదించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్.ఐ లు సురభి సంపత్, ముత్తయ్య, సిబ్బంది శ్రీనివాస్, శేఖర్, రబ్బాని, సాగర్ల శంకర్, ఆంజనేయులు, అంజద్ ,కిరణ్ అంజయ్య, మహేశ్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Ganja
- Nalgonda News
- Weed oil
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

