శనివారం 04 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 01:36:24

నరేగా కింద రూ.200 కోట్ల ఆర్‌ అండ్‌ బీ పనులు

నరేగా కింద రూ.200 కోట్ల  ఆర్‌ అండ్‌ బీ పనులు

  • అధికారులతో మంత్రి వేముల సమీక్ష

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద ఈ ఏడాది రూ.200 కోట్ల ఆర్‌అండ్‌బీ పనులు చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నరేగాకు రోడ్ల నిర్వహణ పనుల అనుసంధానంపై మంత్రి బుధవారం ఎర్రమంజిల్‌లోని కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. యంత్రాలతో జరిగే పనులను మినహాయించి రోడ్లకిరువైపలా ఉన్న పొదల తొలగింపు, షోల్డర్స్‌ను మట్టితో చదును చేయడం వంటి పనులను కూలీలతో చేయించవచ్చని తెలిపారు. ఈ పనులకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో రోడ్లు, భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌ శర్మ, ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.logo