మోసపోయి..గోసపడుతున్నాం..
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో మోసపోయి..గోస పడుతునన్నామని.. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనైనా తప్పును సరిదిద్దుకుని బీఆర్ఎస్పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను గెలిపించుకుందామని బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.
- మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
- ఇబ్రహీంపట్నంలో భారీ రోడ్‌షో, బహిరంగసభ
- కాంగ్రెస్ నాయకుల అరాచకం పెరిగిపోయింది : మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం, మే 8 : కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో మోసపోయి..గోస పడుతునన్నామని.. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనైనా తప్పును సరిదిద్దుకుని బీఆర్ఎస్పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌ను గెలిపించుకుందామని బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నంలో క్యామ మల్లేశ్‌కు మద్దతుగా మార్కెట్‌యార్డు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటినా ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించా రు. ముఖ్యమంత్రే వీధిరౌడీలా ప్రవరిస్తూ ప్రతిపక్షనేత కేసీఆర్‌ను దూషిస్తున్నారని మండిపడ్డారు. మరోసారి మోసపోకుండా ఈ ఎన్నికల్లో బీసీ నాయకుడైన క్యామ మల్లేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులకు సూ చించారు.
కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పెరిగాయి..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోని వచ్చి ఐదు నెలలు దాటినా తాను మంజూరు చేయించిన నిధులను ఖర్చుపెట్టే స్థితిలో లేదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హామీల అమల్లో విఫలమైందని.. సమస్యలు చెప్పుకొందా మంటే స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉండడంలేదని ప్రజలు ఇబ్బందిపడుతు న్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ రావడంతోనే రాష్ట్రంలో కరువువచ్చిందని, అయినా పట్టించుకున్న నాథుడే లేడన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, దండెం రాంరెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, సత్తువెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేశ్, నాయకులు రాంరెడ్డి, బుగ్గరాములు, వెంకట్‌రెడ్డి, జంగయ్య, కళమ్మ, రవీందర్‌రెడ్డి, రాజు, మొద్దు అంజిరెడ్డి, అరవింద్, కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆశీర్వదిస్తే.. అందుబాటులో ఉంటా..
ఈ ప్రాంతవాసిని.. మీలో ఒకడిని.. ఆశీర్వదించి గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటా. బడుగు, బలహీన వర్గాలకు బీఆర్ఎస్ అధిక ప్రాధాన్యమించింది. కాంగ్రెస్, బీజేపీలు బలహీన వర్గాలను విస్మరించాయి. ప్రతి ఒక్కరూ రాజకీయాలకతీతంగా గెలిపించాలి. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ నాయకులకు అహంకారం పెరిగిపో యింది.. వారికి బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలి. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిపై ఆదిబట్ల ఠాణా పరిధిలో కేసు నమోదైంది. అలాంటి వ్యక్తులకు అధికారమిస్తే ఈ ప్రాంతాన్ని మరింత నాశనం చేస్తారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది. యాచారం ఎంపీపీ, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. ఇలాంటి పార్టీలకు అవకాశం ఇవ్వొద్దు.
-క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ అభ్యర్థి
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

