ధైర్యం లేకనే క్షుద్ర రాజకీయాలు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకనే కాంగ్రెస్ పార్టీ క్షుద్ర రాజకీయాలకు తెరలేపిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. హరీశ్‌రావుపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్ఫచారాన్ని ఖండిస్తూ బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
- ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆగ్రహం
సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 5: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకనే కాంగ్రెస్ పార్టీ క్షుద్ర రాజకీయాలకు తెరలేపిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. హరీశ్‌రావుపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్ఫచారాన్ని ఖండిస్తూ బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరీశ్‌రావు లేవనెత్తిన ప్రజా సమస్యలను పరిష్కరించే దమ్ము లేక కాంగ్రెస్ పార్టీ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హిందూ సంస్కృతిని అగౌరపరుస్తూ, పవిత్ర ఆలయాల ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారన్నారు. అర్చకుల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, సనాతన ధర్మం, ధార్మిక కార్యక్రమాలపై దుష్ర్ఫచారం చేస్తున్నారని మండిపడ్డారు.
చేతనైతే హరీశ్‌రావు అడిగిన విధంగా గోదావరి జలాలను రైతుల పంట పొలాలకు తరలించాలని సవాల్ విసిరారు. రైతులకు పూర్తి స్థాయిలో పంటరుణమాఫీ చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావుపై చేస్తున్న ఆరోపణలపై ఆధారాలు ఉంటే ప్రజల ముందు ఉంచాలని, లేనిపక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుళ్లపై ప్రమాణం చేసి ఆలయాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, ఇప్పుడు ఆలయాలు, పూజలు, అర్చకులపైనే విమర్శలు చేయటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

