Ishan Kishan | దులీప్ ట్రోఫీలో రికార్డు సృష్టించిన ఇషాన్ కిషన్.. 39 ఏళ్ల రికార్డు బద్ధలు..!
Ishan Kishan | భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్, ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan kishan) సరికొత్త చరిత్ర సృష్టించాడు. దులీప్ ట్రోఫీ 2026 (Dulip trophy) ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఏకంగా 39 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. సౌత్ జోన్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం (MA Chidambaram) స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 350 పరుగులు సాధించాడు.
Ishan Kishan : భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్, ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan kishan) సరికొత్త చరిత్ర సృష్టించాడు. దులీప్ ట్రోఫీ 2026 (Dulip trophy) ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఏకంగా 39 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. సౌత్ జోన్‌తో చెన్నై (Chennai) లోని ఎంఏ చిదంబరం స్టేడియం (MA Chidambaram stadium) వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 350 పరుగులు సాధించాడు. దీంతో దులీప్ ట్రోఫీ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్‌కు కిషన్ అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 344 బంతులు ఎదుర్కొని ఏకంగా 270 పరుగులు చేశాడు. అతడి భారీ డబుల్ సెంచరీ సాయంతో ఈస్ట్ జోన్ 708 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్‌ను 336 పరుగులకే కట్టడి చేసి 372 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ తన ఫామ్‌ను కొనసాగించిన ఇషాన్, కేవలం 98 బంతుల్లో 80 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఈ ప్రదర్శనతో దులీప్ ట్రోఫీలో ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా ఇషాన్ నిలిచాడు. ఇంతకుముందు 1987 అక్టోబర్‌లో భిలాయ్‌లో వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ తరఫున ఆడిన రామన్ లాంబ 320 పరుగులు చేసిన రికార్డును కిషన్ సునాయాసంగా అధిగమించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. తన కెరీర్లో క్లిష్ట దశ తర్వాత మానసికంగా చాలా తేలికపడ్డానని చెప్పాడు. అనవసరమైన ఆలోచనలు, అంచనాలను మనసులోంచి తీసేశానని, బ్యాటర్‌గా పరుగులు చేయడమే మన పని అని గ్రహించానని అన్నాడు.
ఇతర ఆలోచనలు మన మైండ్‌సెట్‌ను దెబ్బతీసి, ఒత్తిడిని పెంచుతాయన్నాడు. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఆట సులభం అవుతుందని ఇప్పుడు అర్థమైందని, ప్రస్తుతం తాను దేని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని అన్నాడు. బంతిని చూసి దానికి తగ్గట్టు స్పందించడమే నా పని అని వివరించాడు. గతంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయి ఇబ్బందులుపడ్డ ఇషాన్ కిషన్, దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించి తిరిగి భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

