Philippines boat fire | ఫిలిప్పీన్స్‌లో(Philippines )ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పలవాన్ ప్రావిన్స్‌లోని(Palawan province) పర్యాటక కేంద్రం సమీపంలో 134 మందితో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ ఫెర్రీలో(Boat fire )ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 87 మంది ఆచూకీ తెలియకుండా పోయిందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 42 మందిని రక్షించినట్లు వివరించారు. వారిలో 38 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని చెప్పారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఎంవీ జూన్ ఆస్టర్ అనే ప్యాసింజర్ ఫెర్రీ మనీలా నుంచి పలావాన్ ప్రావిన్స్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కోరన్కు బయలుదేరింది. బరంగే మార్సిల్లా తీరానికి సుమారు 2.2 కిలోమీటర్ల దూరంలో ప్రయాణి స్తుండగా ఒక్కసారిగా ఫెర్రీలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 38 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కలిపి మొత్తం 42-43 మందిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకుని తీరానికి తరలించారు. ఇంకా 87 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్ట్ గార్డ్ కెప్టెన్ నోయెమీ కాయబ్యాబ్ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫెర్రీలో సంభవించిన అగ్నిప్రమాదం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.
Five casualties were initially reported after passenger ship MV June Aster caught fire in waters off Coron, Palawan, on Wednesday (Sept. 9, 2026) night, the Philippine Coast Guard said.
As of 11:10 p.m., PCG spokesperson Commodore Noemie Cayabyab said 42 people had been rescued,… pic.twitter.com/4g7pyW4AsM
— Philippine News Agency (@pnagovph) September 10, 2026