Maruti Suzuki Swift 2024 | మార్కెట్లోకి మారుతి సుజుకి స్విఫ్ట్ అప్డేటెడ్ ఆవిష్కరణ.. ధరెంతంటే..?!
Maruti Suzuki Swift 2024 | మారుతి సుజుకి గురువారం తన మారుతి సుజుకి స్విఫ్ట్ -2024 వర్షన్ కారు ఆవిష్కరించింది.
Maruti Suzuki Swift 2024 | భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. అందునా అత్యధికంగా ప్రజల ఆదరణ చూరగొన్న హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఒకటి. ప్రజాదరణను పరిగణనలోకి తీసుకున్న మారుతి సుజుకి గురువారం మారుతి సుజుకి స్విఫ్ట్ -2024 వర్షన్ కారు ఆవిష్కరించింది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లలో లభిస్తున్న మారుతి స్విఫ్ట్.. కొత్తగా 1.2 లీటర్ల త్రీ-సిలిండర్ జడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 80 బీహెచ్పీ విద్యుత్, 112 ఎన్ఎం టార్క్ ఆవిష్కరిస్తుంది. లీటర్ పెట్రోల్ మీద 25.72 కి.మీ మైలేజీ అందిస్తుంది.
ఫ్రాంక్స్, బ్రెజా, బాలెనో మోడల్ కార్ల మాదిరిగా ప్రీమియం లుక్ వచ్చేలా ఇంటీరియర్‌గా ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో 7-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, హెడ్ అప్ డిస్ ప్లే, వైర్ లెస్ చార్జింగ్, రేర్‌లో ఏసీ వెంట్స్ వంటి అత్యాధునిక ఫీచర్లు జత చేశారు. ఇక కొత్త స్విఫ్ట్ అన్ని వేరియంట్లలో 6-ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్‌గా అమరుస్తోంది. దీంతోపాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రివర్స్ కారు పార్కింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నారు. ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు రూ.6.50 లక్షల నుంచి రూ.9.65 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ లభిస్తుంది. కొత్త గ్రిల్లేతోపాటు ఎల్ఈడీ డీఆర్ఎల్ హెడ్ ల్యాంప్స్, రేర్‌లో స్కిడ్ ప్లేట్ తో కూడిన కొత్త బంపర్ జత చేశారు. సీ-ఆకారంతో కూడిన డీఆర్ఎల్ స్పెషల్ లైట్స్ అమర్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

