గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 15, 2020 , 12:30:20

తుమ్మెదవాగులో కొట్టుకుపోయిన లారీ... చిక్కుకున్న డ్రైవ‌ర్‌

తుమ్మెదవాగులో కొట్టుకుపోయిన లారీ... చిక్కుకున్న డ్రైవ‌ర్‌

సిద్దిపేట : రాష్ర్టంలో ఏక‌ధాటిగా కురుస్తున్న వ‌ర్షాల‌తో జ‌ల‌వ‌న‌రులు నీటిక‌ళ‌ను సంత‌రించుకున్నాయి. నీటి ప్ర‌వాహాలు ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండ‌లం బ‌స్వాపూర్ వంతెన స‌మీపంలో గ‌ల తుమ్మెద‌వాగు సైతం ఉధృతితో ప్ర‌వ‌హిస్తుంది. ఈ ప్ర‌వాహాన్ని త‌క్కువ‌గా అంచ‌నావేసిన ఓ లారీ డ్రైవ‌ర్ లారీని వాగు దాటించేందుకు ప్ర‌య‌త్నించాడు. కాగా ప్ర‌వాహ వేగానికి లారీ వాగులో కొట్టుకుపోగా డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌మై ఓ చెట్టును ఆశ్ర‌యించాడు. ఓ బాట‌సారి ఇది గ‌మ‌నించి స్థానిక అధికారుల‌కు స‌మాచారం అందించాడు. విష‌యం తెలిసిన మంత్రి హ‌రీశ్‌రావు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాధితుడిని ర‌క్షించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిందిగా సూచించారు.

తాజావార్తలు


logo