చౌటుప్పల్, జనవరి 9 : రీజినల్ రింగ్ రోడ్డులో(RRR) భూములు కోల్పోతున్న నిర్వాసితులు ఆందోళనకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్( Choutuppal) ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం చౌటుప్పల్, వలిగొండ మండల్లాలోని వివిధ గ్రామాల రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి ధర్నా చేశారు. ఈ ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. అయినా రైతులు లెక్క చేయకుండా ధర్నాకు దిగారు. అనంతరం 65వ జాతీయ రహదారిపైన రాస్తారోకో కూడా చేశారు.
వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ‘మా భూములు మాకే కావాలి..కన్న తల్లి ముద్దురా ట్రిపుల్ ఆర్ వద్దురా.. ప్రాణం పోయినా సరే భూములు ఇవ్వం’ అంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను వదులుకునే ప్రసక్తే లేదని తెలిపారు. ఎన్నో రోజులుగా తాము నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలైన్మెంట్ మార్చే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ద్వారా తమ నిరసన అణచివేయడం సరైందికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | నాలుగైదు ప్రశ్నలను నలభై రకాలుగా అడిగారు.. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్
Revanth Reddy | జులై 6 లోగా పాస్‌పోర్టు తిరిగి అప్పగించండి.. సీఎం రేవంత్‌కు ఏసీబీ కోర్టు ఆదేశం
RS Praveen Kumar | కేటీఆర్ గారూ.. సత్యం మీ వైపే ఉంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్