Revanth Reddy | జులై 6 లోగా పాస్‌పోర్టు తిరిగి అప్పగించండి.. సీఎం రేవంత్‌కు ఏసీబీ కోర్టు ఆదేశం
Revanth Reddy | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జనవరి 13 నుంచి 23వ తేదీ వరకు సీఎం విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది.
Revanth Reddy | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జనవరి 13 నుంచి 23వ తేదీ వరకు సీఎం విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తన పాస్‌పోర్టును ఏసీబీ కోర్టుకు అప్పగించిన విషయం విదితమే.
బ్రిస్బేన్, దావోస్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లాల్సి ఉందని, ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టును రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. ఇందుకు ఆరు నెలల పాటు తన పాస్‌పోర్టు ఇవ్వాలని కోర్టును రేవంత్ రెడ్డి కోరారు. రేవంత్ రెడ్డి అభ్యర్థనను అంగీకరించిన కోర్టు.. జులై 6వ తేదీలోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది. రూ.50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
పదేళ్ల క్రితం ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినప్పటి నుండి రేవంత్ రెడ్డి పాస్‌పోర్ట్ ఏసీబీ కోర్టులోనే ఉంది. ఎప్పుడన్నా విదేశాలకు వెళ్లాలంటే ప్రత్యేకంగా పిటిషన్ వేసి ఆ పాస్‌పోర్టును కోర్టు నుండి తీసుకోవాలి. పర్యటన అయిపోగానే మళ్లీ ఏసీబీ కోర్టులో సమర్పించాలి.
ఇవి కూడా చదవండి..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

