KTR | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలను ఏసీబీ అధికారులు నలభై రకాలుగా అడిగారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు కొత్తగా అడిగిందేమీ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏసీబీ విచారణ ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఏసీబీ వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు అవగాహన మేరకు, తెలిసిన మేరకు సమాధానం ఇచ్చాను. పూర్తిస్థాయిలో విచారణకు సహకరించాను. ఎన్నిసార్లు.. ఎప్పుడు పిలిచినా తిరిగి విచారణకు వస్తానని చెప్పాను. ఇది చెత్త కేసు.. విషయమే లేదు.. అని విచారణ అధికారులకు కూడా చెప్పాను. ఈ ప్రభుత్వం ఒత్తిడిలో మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియట్లేదని చెప్పాను. అసంబద్దమైన కేసులో ఎందుకు విచారిస్తున్నారని అడిగాను. ఇవాళ పొలిటికల్ ప్రెజర్లో ఏదో సాధిస్తారనుకుంటే పొరపాటు అని చెప్పాను. మళ్లీ విచారణకు ఎప్పుడు పిలిచినా పూర్తిస్థాయిలో సహకరిస్తానను అని చెప్పాను. సీఎం రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలను నలభై రకాలుగా అడిగారు. కొత్తగా అడిగిందేమీ లేదు. డబ్బు పంపిన మాట వాస్తవమే.. కానీ కరప్షన్ ఎక్కడుంది అని అడిగాను. ఏసీబీ అధికారుల నుంచి సమాధానం లేదు అని కేటీఆర్ తెలిపారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దాదాపు ఆరున్నర గంటల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. తన లాయర్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | జులై 6 లోగా పాస్‌పోర్టు తిరిగి అప్పగించండి.. సీఎం రేవంత్‌కు ఏసీబీ కోర్టు ఆదేశం
RS Praveen Kumar | కేటీఆర్ గారూ.. సత్యం మీ వైపే ఉంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్