RS Praveen Kumar | హైదరాబాద్ : కేటీఆర్ గారూ.. ఏసీబీ కేసులో చింతించాల్సిన పని లేదు.. సత్యం మీ వైపే ఉందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కోసం మీరు విత్తనం నాటారు. ఇది మిలియన్ల డాలర్ల పెట్టుబడిని తీసుకువచ్చేది, తెలంగాణ యువతకు వేల ఉద్యోగాలను సృష్టించేది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ప్రతీకారంతో మత్తులో ఉన్న రేవంత్ రెడ్డి, అజ్ఞానంతో తెలంగాణ రాబరీ వ్యాలీ(TRV) కోసం విత్తనాలు నాటడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. తెలంగాణను పట్టపగలే అతని కుటుంబం, అనుచరులు దోచుకోవచ్చు. సత్యానికి, అబద్దానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. విషానికి, విజన్‌కు మధ్య జరిగే పోరాటం ఇది. చరిత్ర ఎల్లప్పుడూ నిజం వైపే ఉంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | కేటీఆర్ ఏసీబీ విచారణకు లంచ్ బ్రేక్.. మధ్యాహ్నం వరకు 15 ప్రశ్నలు..!