Rasamai Balakishan | హైదరాబాద్ : తెలంగాణ ప్రజల సంస్కృతిని అవమానించేలా మాట్లాడిన దిల్ రాజు సినిమాను తిరస్కరించాలని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి రసమయి బాలకిషన్ మీడియాతో మాట్లాడారు.
నేను నిజాయితీగా, మాట మీద నిలబడుతానని పొంకనాలు పలికిన రేవంత్ రెడ్డి.. రాత్రికి రాత్రి గేమ్ ఛేంజర్ సినిమాకు బెనిఫిట్ షోలు, అదనపు షోలకు జీవో జారీ చేశారు. దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్లేమన్న దేశభక్తులా..? దేశ రక్షణకు పాటు పడుతున్నారా..? అదనపు, బెనిఫిట్ షోలు ఎందుకు అని రేవంత్ రెడ్డి మొన్నటికి మొన్న మాట్లాడారు. ఇవాళ దిల్ రాజుకు రేవంత్ రెడ్డి ఎంతకు అమ్ముడు పోయారు..? కేవలం నాలుగు షోలు ఉంటాయి. కానీ తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి పోయి గేమ్ ఛేంజర్ చూడాల్నట. మరి గేమ్ ఛేంజర్‌కు నిన్ను ఏం గేమ్ ఛేంజర్ చేశాడో చెప్పాలి అని సీఎం రేవంత్ రెడ్డిని రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో దిల్ రాజు లేడు. దిల్ రాజు దిల్ ఎప్పుడు ఆంధ్రా వైపే. ఉద్యమ సమయంలో చెప్పాం.. ఇవాళ కూడా అదే చెబుతున్నాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆడియో ఫంక్షన్లో మాట్లాడిన మాటలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు. మటన్ ముక్కకు, కల్లును మాత్రమే ఆరాధిస్తారు.. సినిమాలను ఆరాధించరు అని దిల్ రాజు మాట్లాడిండు. ఇంత అవమాకరమైన మాటలు మాట్లాడిన దిల్ రాజు సినిమాను తెలంగాణ ప్రజలు తిరస్కరించాలి. తెలంగాణ సంస్కృతిని అవమానించారు. తెలంగాణలో బతుకైనా, చావైనా, పండుగైనా కల్లు ఉంటది.. మటన్, చికెన్ ఉంటది. నీవు తీసిన బలగం సినిమాలో కూడా ఆత్మ శాంతించాలని కల్లు పెట్టి, మటన్ పెట్టి చూపించావ్. నల్లి బొక్క మీద, కల్లు మీద, ప్రజల సంస్కృతి మీద ఆప్యాయతల మీద నీవు తీసిన సినిమాను ఆదరించారు. నీవు ఆ ఆదరణను, కృతజ్ఞతను మరిచిపోయావు. బలగం సినిమాను గొప్పగా ఆదరించారు. కానీ ఇవాళ నీవు వారినే అవమానిస్తున్నావ్. కేవలం నీ సినిమాల కోసం ఆంధ్రా వ్యక్తులను పొగుడుతూ మాట్లాడడం సరికాదు. సీఎం ఎంతకు అమ్ముడు పోయాడు. మీ బెనిఫిట్ కోసమే బెనిఫిట్, అదనపు షోలను ప్రదర్శిస్తున్నారా..? అని ప్రజలు అడుగుతున్నారు. ప్రశ్నించే వ్యక్తులపై కేసులు పెడుతున్నవ్.. ఆరు గ్యారెంటీలను మరిచిపోయావు. తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నారు. అదనపు షోలకు అనుతి ఇచ్చేది లేదని సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడిండు. ఆయన కూడా దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | లాయర్ రామచంద్రరావుతో కలిసి.. ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్
KTR | నేను కేసీఆర్ సైనికుడిని.. నిఖార్సయిన తెలంగాణ బిడ్డను: కేటీఆర్
KTR | తెలంగాణ, హైదరాబాద్ ఇమేజ్ను పెంచేందుకే.. ఫార్ములా-ఈ రేస్‌ను తీసుకొచ్చాం: కేటీఆర్