KTR | కేటీఆర్ ఏసీబీ విచారణకు లంచ్ బ్రేక్.. మధ్యాహ్నం వరకు 15 ప్రశ్నలు..!
KTR | ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో నమోదైన ఏసీబీ కేసు విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన న్యాయవాది రామచంద్రరావుతో కలిసి హాజరైన సంగతి తెలిసిందే.
KTR | హైదరాబాద్ : ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో నమోదైన ఏసీబీ కేసు విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన న్యాయవాది రామచంద్రరావుతో కలిసి హాజరైన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 1.30 గంటలకు ఏసీబీ విచారణకు అధికారులు విరామం ఇచ్చారు. లంచ్ బ్రేక్ అనంతరం తిరిగి విచారణ ప్రారంభం కానుంది. లంచ్ బ్రేక్ వరకు మూడు గంటల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. కేటీఆర్‌ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతీరాజ్, అడిషనల్ ఎస్పీ శివరాం శర్మ, డీఎస్పీ మాజీద్ ఖాన్ విచారిస్తున్నారు.
ఫార్ములా ఈ- కార్ రేస్‌లో జరిగిన నగదు చెల్లింపులపై కేటీఆర్‌ను మధ్యాహ్నం వరకు ఏసీబీ 15 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఈ- కార్ రేస్ నిర్వహణలో మీ పాత్ర ఏంటి..? ఆర్గనైజర్స్కు నగదు చెల్లింపులు మీ ఆధ్వర్యంలోనే జరిగాయా..? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో చెల్లింపులు ఎందుకు చేశారు..? నగదు చెల్లింపుల్లో క్యాబినెట్ అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు..? హెచ్ఎండీఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు తెలిసే చెల్లింపులు జరిగాయా..? పౌండ్స్ రూపంలో ఇండియన్ కరెన్సీ విదేశీ అకౌంట్‌కు చెల్లించినపుడు ఆర్బీఐ అనుమతి లేదు.. అసలు అనుమతులు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది..? మీరు సక్సెస్ ఫుల్ ఈవెంట్‌గా భావిస్తున్న ఈ కార్ రేస్‌లో ప్రమోటర్స్ ఎందుకు వెనక్కి తగ్గారు..? అని కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
KTR | నేను కేసీఆర్ సైనికుడిని.. నిఖార్సయిన తెలంగాణ బిడ్డను: కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
Jeevan Reddy | రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ములకలపల్లి మండలంలో అతి భారీ వర్షం
Munnuru Kapu | మున్నూరు కాపులకు అన్యాయం చేస్తే సహించేది లేదు : రాష్ట్ర కార్యదర్శి హెచ్చరిక
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 3వ పొజిషన్లో 13 వేల రన్స్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

