కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉన్నది. వర్షం కారణంగా మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లి, కొత్తగూడెం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రాజధాని హైదరాబాద్లో కూడా నిన్న రాత్రి నుంచి వాన కురుస్తున్నది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. హయత్నగర్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, నాంపల్లి, లక్డీకపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది.