పీహెచ్‌డీకి కామన్ అడ్మిషన్ టెస్ట్

- ఓయూకు సీపీగెట్ నిర్వహణ బాధ్యతలు
- నాలుగు కాలేజీల్లో కొత్త బీఏ ఆనర్స్ కోర్సు
- దోస్త్ నుంచి జీరో అడ్మిషన్ కాలేజీల ఉపసంహరణ
- డిగ్రీ కాలేజీలకు కామన్ అకడమిక్ క్యాలెండర్
- ఉన్నత విద్యామండలి అధికారుల కీలక నిర్ణయాలు
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందుకు విధివిధానాల రూపకల్పనకు కమిటీని నియమించాలని నిశ్చయించింది. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం డిగ్రీ ప్రవేశాలుసహా అకడమిక్ క్యాలెండర్‌పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, కళాశాల విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్, కాకతీయ, ఉస్మానియా, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీలు తాటికొండ రమేశ్, డీ రవీందర్‌యాదవ్, రవీందర్‌గుప్తా, ఎల్పీ లక్ష్మీకాంత్ రాథోడ్, సీహెచ్ గోపాల్‌రెడ్డి, సీతారామారావు, ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
- 2021-22 విద్యాసంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్ నిర్వహణను ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్సిటీకే అప్పగించారు.
- పీహెచ్డీ ప్రవేశాల కామన్ అడ్మిషన్ టెస్ట్‌కు యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి విధివిధానాల ఖరారుకు నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ కమిటీని నియమించే అధికారాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు అప్పగించారు.
- క్టస్లర్ విధానంలో డిగ్రీ కాలేజీలు కోర్సులు, కోర్సుల మెటీరియల్ మార్పిడికి పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ఇందుకు నిపుణుల కమిటీని ఏర్పాటుచేయనున్నారు.
- బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తయారుచేసిన ఈ రీసోర్సెస్, కోర్సు మెటీరియల్‌ను అన్ని యూనివర్సిటీలు వినియోగించుకోవాలని సూచించారు.
- రెండేండ్ల కాలంలో జీరో అడ్మిషన్లు పొందిన కాలేజీలను దోస్త్ వెబ్సైట్ నుంచి తొలిగించనున్నారు.
- ఓయూ పరిధిలోని నాలుగు వర్సిటీ కాలేజీల్లో కొత్తగా బీఏ ఆనర్స్ కోర్సును పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలుచేయనున్నారు. ఈ కోర్సు కరిక్యులం తయారుచేయాలని నిర్ణయించారు.
- రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలన్నింటికీ కామన్ అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించారు. తరగతులు, పరీక్షలు, ప్రాక్టికల్స్, సహా సెలవులతో కూడిన విద్యా క్యాలెండర్‌ను విడుదల చేశారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

