ఆదిలాబాద్ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జెడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా ఉన్నతాధికారులు, వైద్య శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజలకు సరైన వైద్యం అందేలా అధికారులు కృషి చేయాలన్నారు.
త్వరగా ఫీవర్ సర్వేలు పూర్తి స్థాయిలో నిర్వహించాలని కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి ఉచితంగా మందులు అందించాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలి. వారికి అవగాహన కల్పించాలన్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో జనం ఎక్కువగా ఉండకుండా చూడాలన్నారు. సమావేశంలో కలెక్టర్ రాహుల్ రాజ్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆక్సిజన్‌కు కొరత లేదు : మంత్రి జగదీష్ రెడ్డి
విషాదం : చెరువులోపడి యువకుడి మృతి
పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే మేయర్ ఎన్నిక
కరోనా నియంత్రణపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష
కరోనా బాధితులకు డ్రైఫ్రూట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే